calender_icon.png 19 May, 2025 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో రైతుభరోసా

19-05-2025 01:29:08 AM

-ముంచుకొస్తున్న వానకాలం సీజన్

-ఇప్పటివరకు మూడున్నర ఎకరాలలోపు రైతులకే సాయం

-ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.4వేల కోట్లు జమ

-మిగిలిన రైతులకు సాయం అందించేందుకు 5 వేల కోట్లు అవసరం.. నిధులు సమకూర్చే పనిలో సర్కార్

హైదరాబాద్, మే 18 (విజయక్రాంతి): వానకాలం సీజన్ వచ్చేస్తున్న ది. రైతులు సాగుకు సిద్ధమవుతున్నా రు. ఇప్పటికే దుక్కులు దున్నుకుని సం సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు మూడున్నర ఎకరాల లోపు ఉన్న రైతులకే ‘రైతుభరోసా’ పేరిట పెట్టుబడి సాయం అందించింది.

ఈ ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో ఎకరానికి రూ.6 వేల చొప్పున రూ.4 వేల కోట్లు జమ చేసింది. అయితే.. మూడున్నర ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు తమకెప్పుడు పెట్టుబడి సాయం అందుతుం దా? అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం అదను దాటకముందే రైతులకు రైతుభరోసా అందజే యాలని నిర్ణయించింది.

మిగిలిన రైతుల ఖాతాల్లో త్వరలో  పెట్టుబడి సాయం జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నది. అందుకు మరో రూ.5వేల కోట్ల అవసరమవుతాయని, ఈ మేరకు నిధులను సర్దుబాటు చేయాలని ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేసింది. 

నిధులు సమకూర్చేపనిలో ఆర్థికశాఖ

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.5 వేల చొప్పున రైతులకు పెట్టుబడి సాయం అందించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు ఎకరానికి రూ.6 వేల చొప్పున అందజేస్తున్నది. దీనిలో భా గంగా వచ్చే వానకాలం సీజన్‌కూ మూడున్నర ఎకరాలలోపు ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందజేసింది. ఇక అంతకంటే ఎక్కు వ భూమి ఉన్న రైతులు పెట్టుడిసాయం కోసం ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరైన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలను రైతుభరోసా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. సర్కార్ రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించడం లేదని ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. రైతుల నుంచి ఒత్తిళ్లను గమనిం చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వీలైనంత త్వరలో రైతులకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించారు. నిధులు సర్దుబాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ఆర్థికశాఖకు ఆదేశాలు జారీ చేశారు. 

వానకాలంలో రాష్ట్రవ్యాప్తంగా రూ.1.50 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేయగా, రైతులకు రూ.9 వేల కోట్ల నిధులు పెట్టుబడి సాయానికి అవసరమవుతాయని అంచనా వేసింది. ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ.4 వేల కోట్లు జమ చేయగా, మరో రూ.5 వేల కోట్ల నిధులు సమకూర్చే పనిలో సర్కార్ నిమగ్నమైంది.