calender_icon.png 13 May, 2025 | 10:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్బాయిలదే హవా!

12-05-2025 01:52:25 AM

ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

  1. ఇంజినీరింగ్ టాప్‌టెన్ అంతా బాలురే 
  2. అగ్రికల్చర్ టాప్‌టెన్‌లో 9 మంది బాలురే
  3. ఏపీ విద్యార్థికి ఇంజినీరింగ్ మొదటి ర్యాంక్ 
  4. అగ్రికల్చర్‌లో మేడ్చల్ విద్యార్థికి ఫస్ట్ ర్యాంక్

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): తెలంగాణ ఎప్‌సెట్ ఫలితాలను ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి విడుదల చేశారు. 11 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫలితాలు విడుదల చేశారు. రాష్ర్టవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో సీట్ల భర్తీ కోసం ప్రభుత్వం ఎప్‌సెట్‌ను నిర్వహించింది.

జేఎన్టీయూ ఆధ్వర్యంలో జరిగిన పరీక్షల్లో ఫార్మా, అగ్రికల్చర్ విభాగం పరీక్షలకు 86,762 మంది దరఖాస్తు చేసుకోగా 81,198 మంది, ఇంజిరింగ్ విభాగం పరీక్షలకు 2,20,326 మంది దరఖాస్తు చేసుకోగా 2,07,190 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగం లో 73.26 శాతం, అగ్రివిభాగంలో 87.82 శాతం మంది క్వాలిఫై అయ్యారు. ఏప్రిల్ 29నుంచి ఈనెల 4వరకు తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు నిర్వహంచారు.

ఇంజినీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకులూ బాలురకే వచ్చాయి. ఇందులో ఇద్దరు ఏపీకి చెంది న విద్యార్థులున్నారు. ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడకు చెందిన పల్లా భరత్‌చంద్రకు మొదటి ర్యాంకు, శేరిలింగంపల్లికి చెందిన ఉడగండ్ల రామ్‌చరణ్‌రెడ్డికి రెండోర్యాంకు, ఏపీలోని విజయనగరం జిల్లాకు చెందిన హేమసాయి సూర్యకార్తీక్‌కు మూడో ర్యాంకు వచ్చాయి.

అగ్రికల్చర్, -ఫార్మా ఫలితాల్లో మేడ్చల్‌కు చెందిన సాకేత్ రెడ్డికి మొదటి ర్యాంకు వచ్చింది. కరీంనగర్‌కు చెందిన సబ్బాని లలిత్ వరేణ్య రెండో ర్యాంకు, వరంగల్‌కు చెందిన అక్షిత్‌కు మూడోర్యాంకు లభించాయి. అగ్రి ఫలితాల్లో మొదటి పది ర్యాంకుల్లో కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే ఉండటం గమనార్హం. 

ఎప్‌సెట్ ఇంజినీరింగ్ టాప్‌టెన్ ర్యాంకులు 

1. పల్లా భరత్‌చంద్ర (పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ, ఏపీ)

౨. ఉదగండ్ల రామ్‌చరణ్‌రెడ్డి (శేరిలింగంపల్లి, రంగారెడ్డి జిల్లా)

౩. హేమసాయి సూర్యకార్తీక్  (విజయనగరం, ఏపీ)

౪. మెండె లక్ష్మీభార్గవ్ (నాచారం, హైదరాబాద్) 

౫. మంత్రిరెడ్డి వెంకటగణేశ్‌రాయల్ (మాదాపూర్, హైదరాబాద్) 

౬. సుంకర సాయిరిశాంత్‌రెడ్డి (మాదాపూర్, హైదరాబాద్)

౭. రష్మిత్ బండారి (మాదాపూర్, హైదరాబాద్) 

౮. బనిబ్రత మాజీ (బడంగ్‌పేట్, రంగారెడ్డి) 

౯. కొత్త ధనుష్‌రెడ్డి (హైదరాబాద్) 

౧౦. కొమ్మ శ్రీకార్తీక్ (మేడ్చల్)

అగ్రికల్చర్, ఫార్మావిభాగంలో టాప్‌టెన్ ర్యాంకులు

1. సాకేత్‌రెడ్డి (మేడ్చల్)

౨. సబ్బాని లలిత్‌వరేణ్య (కరీంనగర్)

౩. అక్షిత్ (వరంగల్) 

౪. సాయినాధ్ ( కొత్తకోట, వనపర్తి) 

౫. బ్రాహ్మణి (మాదాపూర్) 

౬. గుమ్మడిదల తేజస్ (కూకట్‌పల్లి)

౭. అఖిరానంద్‌రెడ్డి (నిజాంపేట)

౮. భానుప్రకాశ్‌రెడ్డి (సరూర్‌నగర్) 

౯. శామ్యూల్ సాత్విక్ (హైదర్‌గూడ)

1౦. అద్దుల శశికిరణ్‌రెడ్డి (బాలాపూర్)