calender_icon.png 19 May, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదర్‌నగర్‌లో హైడ్రా కూల్చివేతలు

19-05-2025 11:30:23 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): కూకట్పల్లి నియోజకవర్గం హైదర్‌నగర్‌ డివిజన్లో హైడ్రా కూల్చివేతలు మొదలు పెట్టింది. హెచ్ఎండీఏ లేఅవుట్ సర్వే నంబర్ 145/3లో తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారంటూ 70 మంది ప్లాట్ల యజమానులు హైడ్రా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలో దిగిన హైడ్రా సిబ్బంది పోలీసుల బందోబస్తు నడుమ లేఅవుట్ లోని బారికేడ్లు, అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. కబ్జాదారుల నుంచి తమ భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.