03-07-2025 04:50:53 PM
మందమర్రి (విజయక్రాంతి): జాతీయ ఆహార భద్రత మిషన్ పథకం కింద రైతులకు మంజూరైన వరి విత్తనాల చిరు సంచులను చెన్నూరు వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు బానోత్ ప్రసాద్(Agriculture Department Assistant Director Banoth Prasad) పంపిణీ చేశారు. మండలంలోని పులిమడుగు గ్రామానికి చెందిన రైతులు భుక్యా అలివేణి, కున్సోతు సత్యవ్వలకు వరి కెఎన్ఎం 7715, కే ఎన్ఎం 12510 అను రెండు రకాల వరి విత్తనాల చిరు సంచులను 100% సబ్సిడీపై గురువారం అందచేశారు.
ఈ సందర్భంగా చెన్నూరు ఎడిఎ ప్రసాద్ మాట్లాడుతూ... ఒక్కో సంచి ఐదు కిలోల బరువు ఉండి పది గుంటల పొలంలో నాటు వేయడానికి సరిపోతుందని, ఈ విత్తనాలను ప్రత్యేకంగా నారు పోసి వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ ప్రత్యేక యాజమాన్య పద్ధతులను పాటిస్తూ సాగు చేయాలని కోరారు. విత్తన పనితీరు ఆధారంగా మిగతా రైతులకు చిరు వరి విత్తనాలను అందించడం జరుగుతుందన్నారు. ఈ చిరు వరి విత్తనాల సంచులను సరైన యాజమాన్య పద్ధతులను పాటించి సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, వ్యవసాయ విస్తరణ అధికారులు కనకరాజు, ముత్యం తిరుపతి, రైతులు నీలయ్య, కిషన్, రాజవ్వ లు పాల్గొన్నారు.