calender_icon.png 4 July, 2025 | 7:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురపాలక జేబుకు చిల్లు.. కస్టమర్లకు మాత్రం బిల్లు

03-07-2025 10:39:13 PM

మేడ్చల్ అర్బన్: గుండ్లపోచంపల్లి పురపాలికలోని పలు వాణిజ్య వ్యాపార సంస్థలు ట్రేడ్ లైసెన్స్ పొందకుండానే యథేచ్ఛగా వ్యాపారాలు సాగిస్తున్నారు. తెలంగాణ మున్సిపల్(Telangana Municipal) చట్టం ప్రకారం ట్రేడ్ లైసెన్సులు పొందిన తరువాతే వ్యాపారం చేయాల్సి ఉండగా ఆ నిబంధనలు భేకాతర్ చేస్తూ రూపాయలు లక్షల్లో వ్యాపారం చేసుకుంటూ పబ్బం గడుపుతున్నాయి. ఇదే అంశంపై దృష్టి సాధించాల్సిన సంబంధిత మున్సిపాలిటీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని స్థానిక పట్టణ ప్రజలు ఆరోపణలు వినబడుతున్నాయి. నిబంధనలు పాటించకుండా ట్రేడ్ లైసెన్సులు తీసుకోని వాణిజ్య సంస్థలకు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి సంబంధిత వ్యాపార సంస్థలపై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.