03-07-2025 11:05:20 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో కుటుంబ కలహాలు, మద్యానికి బానిసై ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూడిదిగడ్డ బస్తీకి చెందిన రాధారపు రామచందర్(70) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో కుటుంబానికి కొంతకాలం నుంచి దూరంగా.. అదే బస్తీలో ఒంటరిగా ఉంటున్నాడు. మద్యం తాగి వచ్చి తరచుగా భార్య శాంత ఉన్న ఇంటికి వెళ్ళి గొడవ పడేవాడు. ఎప్పటిలాగే మద్యం తాగొచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఇదే క్రమంలో ఇంటికి వెళ్ళిన రామచందర్ ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.