03-07-2025 10:51:24 PM
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లిలో ప్రమాదవశాత్తు ఇంటిపై నుంచి పడి మృతి చెందిన కందుకూరు తిరుపతి(47) కళ్ళను దానం చేసి ఆయన కుటుంబం ఆదర్శంగా నిలిచింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి పట్టణం హనుమాన్ బస్తీకీ చెందిన కందుకూరు తిరుపతి తన ఇంటి పైకప్పును సరి చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇంటి పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు వరంగల్ ల్లోనీ ఓ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ కందుకూరి తిరుపతి ఆసుపత్రిలోనే మృతి చెందాడు. కుటుంబ పెద్దదిక్కు మృతి చెంది శోకసముద్రంలో ఉన్న ఆ కుటుంబ సేవాభావాం స్ఫూర్తిగా నిలిచింది. కళ్ళు దానం చేసి మరొకరికి కంటిచూపు ప్రసాదించాలని ఉద్దేశంతో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి తిరుపతి కళ్ళను దానం చేశారు. కందుకూరి తిరుపతి కుటుంబ సభ్యుల సేవానిరతిని బస్తీ వాసులు, బంధుమిత్రులు అధ్యంతం వారిని అభినందించక ఉండలేక పోతున్నారు.