calender_icon.png 4 July, 2025 | 9:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగలించిన వాహనాలను తిరిగి పట్టుకొని అప్పగింత

03-07-2025 10:54:09 PM

హనుమకొండ (విజయక్రాంతి): దొంగిలించిన వాహనాలతో హనుమకొండలో తిరిగితే హనుమకొండ ట్రాఫిక్ పోలీసు పట్టేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో దొంగిలించబడిన 10 ద్విచక్రవాహనాలను సంబంధిత బాధితులకు హనుమకొండ ట్రాఫిక్ పోలీసులు అప్పగించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్(Police Commissioner Sunpreet Singh) ఆదేశాల ప్రకారం ట్రాఫిక్ పోలీసులు రోజువారీ చేసే వాహన తనిఖీలు క్షుణ్ణంగా చేయడం వలన 2024 డిసెంబర్ నెల నుంచి ఇప్పటివరకు దొంగిలించి నడుపుతున్న 10 మోటార్ సైకిళ్లను రికవరీ చేసి, వాటి అసలు యజమానులకు (బాధితులకు) అప్పగించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ రాయల ప్రభాకర్ రావు మహబూబాబాద్ కి చెందిన ద్విచక్రవాహనాన్ని అట్టి వాహన యజమానికి అందించడం జరిగింది.

TS26F2961 నంబర్ గల ఈ వాహనం దొంగిలించబడింది అని 2022 మే నెలలో మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేయబడింది. ఇప్పటి వరకు అప్పగించిన 10 ద్విచక్ర వాహనాలలో, 9 వాహనాల పై కరీంనగర్ 1 టౌన్, కొండాపూర్, సదాశివపేట, రాజన్నసిరిసిల్ల, ఆకివీడు (ఆంధ్రప్రదేశ్), ధర్మసాగర్, సుబేదారి, గోదావరిఖని, మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ల లో ఎఫ్ ఐ ఆర్ కాబడినవి. ఇంకొక్క వాహనం కాటారం (భూపాలపల్లి జిల్లా) కి సంబంధించినది. వాహనాలతో పాటు దొరికిన నేరస్తులను సంబంధిత పోలీస్ వారికి అప్పగించడం జరిగింది. హనుమకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జరిగిన ఇట్టి కార్యక్రమానికి టి. సత్యనారాయణ వరంగల్ ట్రాఫిక్ ఏసిపి, హనుమకొండ ట్రాఫిక్ సీఐ జి. సీతారెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.