03-07-2025 10:44:08 PM
ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న నిరుపేద విద్యార్థుల కోసం ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గురువారం పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని మెయిన్ రోడ్ హైస్కూల్, జేబీఎస్ హైస్కూల్లలో అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని ఆకాంక్షించారు. విద్యార్థుల మంచి భవిష్యత్తు కొరకు ఇటువంటి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్యవైశ్య మహాసభకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ధారా రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి యెలుగూరి నాగేష్ కుమార్, ఇల్లందు మండల, పట్టణ, యువజన అధ్యక్షులు ప్రొద్దుటూరి నాగేశ్వరరావు, అర్వపల్లి రాధాకృష్ణ, నరేంద్రుల అను, కండె రమేష్, గౌరిశెట్టి పురుషోత్తం, పల్లెర్ల చంద్రశేఖర్, తాటిపల్లి సుబ్బారావు, యెలుగూరి మల్లికార్జున్, మధుబాబు, సతీష్, ఆనందరావు, వాసవి క్లబ్ అధ్యక్షుడు రవికిరణ్, రాచర్ల వెంకటేశ్వర్లు, బసవయ్య, దివ్వెల నాగేశ్వరరావు, దార ధీరజ్, పాఠశాల ఉపాధ్యాయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాంబాబు, మడుగు సాంబమూర్తి, బోళ్ల సూర్యం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.