03-07-2025 04:53:30 PM
నిర్మల్ (విజయక్రాంతి): దేశంలో అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసమే ఈనెల 9న కార్మికుల సార్వత్రిక సమ్మె నిర్వహిస్తున్నట్టు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాజన్న(IFTU District Secretary Rajanna) తెలిపారు. గురువారం నిర్మల్ పట్టణంలోని బీడీ కార్మికులను బీడీ పరిశ్రమను సందర్శించి సమ్మె యొక్క ప్రాధాన్యతను వివరించి యాజమాన్యులకు సమ్మె నోటీసులు అందించారు. కార్మికులకు పని భద్రత కల్పించాలని కూలీలు పెంచాలని లేబర్ కోడ్ చట్టాలను రద్దు చేయాలని ఇతర డిమాండ్లతో ఈ సమ్మె నిర్వహిస్తున్నామన్నారు. నాయకులు కిషన్ పోశెట్టి లక్ష్మీ గంగాబాయి గఫూర్ గంగన్న రైతులు పాల్గొన్నారు.