calender_icon.png 4 July, 2025 | 7:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబ్ల్యూజేఐ జిల్లా అధ్యక్షుడుకి అభినందన వెల్లువ

03-07-2025 11:09:53 PM

మంచిర్యాల (విజయక్రాంతి): వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(Working Journalists of India) మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన పార్వతి సురేష్ కుమార్ అభినందనలతో మునిగిపోయారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని C4 న్యూస్ కార్యాలయంలో సీపీఐ మండల కార్యదర్శి దుర్గా రాజ్, ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చీర్ల వంశీ, చిప్పకుర్తి శ్రీనివాస్ సురేష్ కుమార్‌ను, రాష్ట్ర నాయకుడు పార్వతి రాజేష్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... డబ్ల్యూజేఐ జిల్లా అధ్యక్షుడిగా పార్వతి సురేష్ బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం సురేష్ ఎప్పుడూ ముందుంటారని, పోరాట పటిమ, ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి జర్నలిస్ట్ సంఘం నాయకుడు కావడం స్థానిక జర్నలిస్టులకు ఎంతో మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ మాట్లాడుతూ... జర్నలిస్టుల సమస్యల పైనే కాకుండా సమాజ శ్రేయస్సు, జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తానని వెల్లడించారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి, సంఘ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డబ్ల్యూజేఐ జిల్లా కోశాధికారి డేగ ఆంజనేయులు, జిల్లా నాయకులు మాసు రాకేష్, జర్నలిస్ట్ వినీత్ తదితరులు పాల్గొన్నారు.