03-07-2025 11:03:18 PM
ఐటిడిఏ పిఓ ఖుష్బు గుప్త
నిర్మల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ఖుష్బూ గుప్త(ITDA Project Officer Khushboo Gupta) ఆకస్మికంగా సందర్శించారు. వంటగది, స్టోర్ రూమ్, రికార్డులను పరిశీలించి పిఓ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న బోధన, మౌలిక సదుపాయాలు, భోజన ఏర్పాట్లను ఆమె సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని పిఓ ఆదేశించారు. ప్రతి రోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఈ సందర్శనలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి అంబాజీ, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.