23-05-2025 12:31:21 AM
నల్లగొండ టౌన్, మే 22: అడవిదేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా సంతృప్తికరమైన వైద్య సేవలు అందిస్తున్నందుకుగాను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పి.హెచ్.సి డాక్టర్, వైద్య సిబ్బందిని అభినందించారు.
గురువారం ఆమె ఏడిపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి ఏఎన్సి రిజిస్టర్, ఓపి రిజిస్టర్, ఈడిడీ క్యాలెండర్, ఏఎన్సీ చెకప్ రిజిస్టర్ అన్నింటిని పరిశీలించి రిజిస్టర్ లన్ని ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు .ఎలాంటి కేసులు పి.హెచ్.సికి వస్తున్నాయని? రిఫరల్ హాస్పిటల్ కి ఎక్కడికి పంపిస్తున్నారని? పిహెచ్ సి డాక్టర్ జానకిరాములు ను అడుగగా మిర్యాలగూడకు పంపిస్తామ ని తెలిపారు.
గురువారం ఎంత మంది ఓపి వచ్చారని ?అడగగా 35 మంది పేషెంట్లు ఓపి రికార్డు అయిందని తెలియజేశారు.అంతకుముందు జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో ఉన్న భవిత కేంద్రాన్ని తనిఖీ చేయగా అక్కడ విద్యుత్తు కనెక్షన్ సరిగా లేనందున తక్షణమే విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. అలాగే కిటికీలకు అద్దాలు వేయించాలని, టాయిలెట్లకు అండర్ డ్రైనేజీ తో పాటు ,నిరంతరం నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అంతేకాక భవిత కేంద్రంలో ర్యాంపు ఏర్పాటు చేయాలని ,ఇంకా ఏమైనా సహాయం అవసరమైతే చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ వెంట ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, మండల ప్రత్యేక అధికారి, డిఎస్‌ఓ వెంకటేశం, తహసిల్దార్ రాగ్యా నాయక్ ,ఎంఈఓ, తదితరులు ఉన్నారు .