23-05-2025 12:34:34 AM
హుజూర్ నగర్, మే 22: తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని మంత్రి ఉత్తమ్ నివాసంలో గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ ముఖ్, పాలకమండలి సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరారు.
మార్కెట్ కమిటీ సభ్యులు ముత్యాలంపాటి నాగుల్ మీరా, బాతుల సైదిరెడ్డి, తోడేటి శ్రీనివాసరావు, మొదాల వెంకన్న, లచ్చిమల్ల నాగేశ్వర్ రావు, నట్టే జానకిరాములు, భూక్యా రాయ్ సాయి, చెక్కర వెంకటరెడ్డి, మట్టపల్లి వెంకటనారాయణ, గుండా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.