22-09-2025 05:34:26 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎంల గోదాంను పరిశీలించారు. గోదాంలో భద్రపరచిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను తనిఖీ చేసి సంబంధిత రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతానికి ఎలాంటి లోటు ఉండకూడదని స్పష్టం చేశారు.
గోదాంలో భద్రతా ఏర్పాట్లను మరింత బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల సెక్యూరిటీ, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అగ్ని మాపక పరికరాలు తప్పనిసరిగా సిద్ధంగా ఉంచాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఎప్పటికప్పుడు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. పారదర్శకమైన ఎన్నికల కోసం అన్ని చర్యలు కచ్చితంగా అమలు చేయాలనీ కలెక్టర్ స్పష్టం చేశారు.