22-09-2025 05:37:14 PM
నిర్మల్ (విజయక్రాంతి): పర్యావరణ విద్య బ్రాండ్ అంబాసిడర్ గా జిల్లా ఎన్జీసి సమన్వయకర్త డి మోహన్ రావును నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ఎన్జీసి డైరెక్టర్ డబ్ల్యూ జి ప్రసన్నకుమార్ ఇచ్చిన నియామక ఉత్తర్వులను నేడు నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారి డి భోజన్న చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా డీఈవో భోజన్న, మోహన్ రావును అభినందిస్తూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో పర్యావరణ విద్యలో భాగంగా, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, ప్లాస్టిక్ నివారణ, సుస్థిర అలవాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు పర్యావరణ పట్ల అవగాహన కల్పించాలని తెలిపారు.