22-09-2025 05:32:16 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని దాసిరెడ్డిగూడెం, ఎదుల్లగూడెం, సంగెం గ్రామాల మీదుగా గౌరెల్లి రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులు సోమవారం వలిగొండ తహసిల్దార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గౌరవెల్లి రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్న తమ భూములకు ప్రభుత్వం అందించే విలువ ప్రకారం మూడు రెట్లు కాకుండా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం తమ భూములకు నష్టపరిహారం చెల్లించాలని అప్పటివరకు ఉత్తమ భూములను ఇవ్వబోమని అన్నారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ భూములు కోల్పోతున్న భూనిర్వాసితుల డిమాండ్ ను ఉన్నతాధికారులకు తెలియజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి భూపాల్ రెడ్డి, కోనపురి శ్రీశైలం, నారి రమేష్, సత్తయ్య, పాశం సత్తిరెడ్డి, రావుల పద్మా రెడ్డి, సంజీవరెడ్డి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.