06-05-2025 05:18:16 PM
పెద్దపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రి కుల్చివేత పనుల పరిశీలనలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష...
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి కూల్చివేత పనులు వారం రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి కూల్చివేత పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పెద్దపల్లిలోని ప్రభుత్వ పాత ఆసుపత్రి భవన కూల్చివేత పనులు వారం రోజులలో పూర్తి చేయాలని తెలిపారు. పాత ఆసుపత్రి స్థానంలో నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.