calender_icon.png 20 December, 2025 | 6:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ వింగ్‌కు మంచిర్యాల జిల్లా కోఆర్డినేటర్‌గా రాజ్ మార్

20-12-2025 04:57:17 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చెందిన కొత్తపల్లి రాజ్ కుమార్ (శ్యామ్) డాక్టర్స్ సెల్, మెడికల్ & హెల్త్ వింగ్ జిల్లా కోఆర్డినేటర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామక ఉత్తర్వులను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జారీ చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి, టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ  బి. మహేష్ కుమార్ గౌడ్, నాయకత్వాన్ని నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తారని రాజ్ కుమార్ తెలిపారు. హెల్త్ వింగ్ లో చోటు కల్పించినందుకు ప్రజా ఆరోగ్యాన్ని బలోపేతం చేయడానికి మరింతగా తోడ్పడతారని కొత్తపల్లి రాజ్ కుమార్ ( శ్యామ్ ) కి బాధ్యతలు అప్పగించినట్టు డాక్టర్ రాజీవ్ తెలిపారు. హెల్త్ వింగ్ లో జిల్లా స్థాయి బాధ్యతలు అప్పగించినందుకు రాజ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.