calender_icon.png 20 December, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కేంద్ర ప్రభుత్వ కూట్రలను తిప్పి కొట్టాలి

20-12-2025 05:02:17 PM

ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కోటేశ్వరరావు

చట్ట పరిరక్షణకు ఊరూరా ఉద్యమాన్ని ఉదృతం చేయాలి

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గ్రామీణ పేదల జీవనోపాధిలో కీలక పాత్ర పోషిస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో వీబీజీ రాంజీ పేరు పెట్టడం సమంజసం కాదని, ఇట్టి కేంద్ర ప్రభుత్వ కుట్రలను ప్రతి ఒక్కరు తిప్పి కొట్టాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శనివారం మండల కేంద్రం అర్వపల్లిలో ఆ సంఘం ఆధ్వర్యంలో బిల్లు పత్రాలను దగ్ధం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం కూలీలకు 100రోజులు తగ్గకుండా పని కల్పించాలని,పని దినాలను 200 రోజులకు పెంచి, ప్రతి కూలీకి రూ.200 నుండి రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు.