calender_icon.png 23 August, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్య శాఖ సమస్యలపై మంత్రి వాకిటి శ్రీహరిని కలిసిన జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి

23-08-2025 05:44:31 PM

మంథని (విజయక్రాంతి): హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari)ని పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి మత్స్యశాఖ సమస్యలను వివరించారు. వాటిలో ముఖ్యంగా ఇప్పటికే ఆలస్యం అయినా ఉచిత చేప పిల్లలను త్వరితగతిన నాణ్యమైన సైజ్ గల చేపపిల్లలను పంపిణీ చేయాలని, అదేవిధంగా మత్స్య కార్మికులకు కొత్త పథకాలను పెట్టి వారికి అండగా నిలవాలని మంత్రిని కోరగా, దానికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం రూ. 123 కోట్ల రూపాయలు విడుదల చేస్తుందని, ఈ సంవత్సరం నుండి వీలైనంత త్వరగా నాణ్యమైన చేప పిల్లలను పంపిణీ చేస్తామని మత్స్యకార్మికులకు నూతన పథకాలకు రూపకల్పన జరుగుతుందని మంత్రి తెలిపారు.