calender_icon.png 23 August, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో పిజి పరీక్షలను పరిశీలించిన రిజిస్ట్రార్

23-08-2025 05:45:36 PM

డిచ్‌పల్లి,(విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీలో ఐదవ రోజు జరుగుతున్న ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎల్.ఎల్.బి ఇంటీ గ్రేటెడ్ పీజీ   కోర్సుల రెండవ, నాల్గవ సెమిస్టర్  పరీక్షలను శనివారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో రిజిస్ట్రార్  ప్రొఫెసర్ ఎం.యాదగిరి ఆకస్మిక తనిఖీ నిర్వహించి, పరీక్ష నిర్వాహణ ఏర్పాట్ల పట్ల  సంతృప్తి వ్యక్తం చేసినారు.

ఈ తనిఖీ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డా. ప్రవీణ్ మామిడాల, వైస్ ప్రిన్సిపాల్ డా. లక్ష్మణ్ చక్రవర్తి, అడిషనల్ కంట్రోలర్ బీ.సాయిలు డైరెక్టర్ పి.ఆర్ఓ డా.పున్నయ్య తదితరులున్నారు. ఉదయం జరిగిన పరీక్షకు 1867 మంది విద్యార్థులకుగాను 1787 మంది విద్యార్థులు హాజరైనారు. 80 మంది విద్యార్థులు గైరాజరైనారు. మధ్యాహ్నం జరిగిన బి.ఎడ్, బి.పి ఎడ్  పరీక్షకు 1359 మంది విద్యార్థులకుగాను 1327 మంది విద్యార్థులు హాజరైనారని 32 మంది విద్యార్థులు గైరాజ రైనారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్  తెలిపారు.