23-08-2025 05:41:43 PM
సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు..
సూర్యాపేట (విజయక్రాంతి): సుప్రసిద్ధ కమ్యూనిస్టు యోధుడు, సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష, ప్రజాస్వామ్య ఉద్యమాలకు తీరని లోటని సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు(CPI Urban Secretary Boora Venkateshwarlu) అన్నారు. సీపీఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్మబిక్షం భవన్, సీపీఐ కార్యాలయంలో సుధాకర్ రెడ్డి చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు బొమ్మగాని శ్రీనివాస్, దంతాల రాంబాబు, దోరేపల్లి శంకర్ లతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సురవరం సుధాకరరెడ్డి చక్కని వాగ్దాటి, విషయ స్పష్టత కలిగిన వక్త అన్నారు.
ఒకతరం విద్యార్థి, యువజనులకు ఆయనో ఆకర్షణ గల నాయకుడు అన్నారు. ఆయన కృషితో పార్టీ మరింత బలపడిందన్నారు. సుధాకర్ రెడ్డి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సీనియర్ నాయకులు అనంతుల మల్లేశ్వరి, చామల అశోక్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్ డేగల జనార్ధన్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాతి సవీందర్ కుమార్, చివ్వెంల మండల కార్యదర్శి ఖమ్మం పాటి రాము, రేగటి లింగయ్య, దీకొండ శ్రీనివాస్, నీలా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.