calender_icon.png 12 January, 2026 | 10:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

12-01-2026 12:35:01 AM

మోతె, జనవరి 11 (విజయక్రాంతి):- మండల పరిధిలోని బుర్క చర్ల గ్రామంలో గ్రామ యూత్ ఆధ్వర్యంలో ఆదివారం సంక్రాతి పండుగ సందర్బంగా ఈ నెల 11 నుంచి 14 వరకు జరిగే జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను గ్రామ సర్పంచ్ దరవత్ కవిత రవి ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారిరక దృఢత్వానికి దోహదపడతాయన్నారు. ఆట ఏదైనా ఆడటం లో గెలుపు ఓటమి లు రెండు ఉంటాయాని గెలిసిన వారు పొంగిపోవడం ఓడిన వారు కుంగి పోవడం తగదన్నారు. సోదర భావం తో ప్రతి ఒక్కరు ఆటలు ఆడాలని కోరారు. ఈ కార్యక్రమం లో గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్యామ్ సుందర్ రెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ కాసాని మధు, కొండ ప్రసాద్, యవజన సంఘం సభ్యులు కొండా నరేష్, బి వెంకన్న, కె. నాగరాజు, మహేష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.