12-01-2026 09:44:04 PM
పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేస్తాం..
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ
సిద్దిపేట రూరల్: గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని, గ్రామాలలోని పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పూజల హరికృష్ణ అన్నారు. సోమవారం జక్కాపూర్ గ్రామంలోని శనిగకుంటలో అంగన్వాడీ భవన భూమి పూజ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన డిసిసి ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ వీర్ తో కలసి మాట్లాడుతూ... తాను గ్రామంలో చేసిన పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అంగన్వాడీ భవనం సాంక్షన్ చేయించానని అన్నారు. శనిగకుంట ప్రజల చిరకాల కోరిక అయిన కాలువ నిర్మాణం కూడా రైతులందరు సహకరిస్తే మంత్రి వివేక్ వెంకట స్వామి తో మాట్లాడి, త్వరలోనే పనులు ప్రారంభించేందుకు కృషి చేస్తానన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పార్టీ పాలనలో కనీసం కాలువలను నిర్మించకుండా ఇక్కడి రైతాంగానికి అన్యాయం చేశారని అన్నారు.