calender_icon.png 13 January, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్యంతోనే పరిశుభ్రత

12-01-2026 10:02:54 PM

వాంకిడి,(విజయక్రాంతి): బంబార గ్రామపంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలని గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజీ తెలిపారు. సోమవారం గ్రామంలోని పలు వార్డుల్లో కొనసాగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనులను ఉప సర్పంచ్ జాడి సంతోష్‌తో కలిసి సందర్శించి పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  కార్యదర్శి దుర్గం ధర్మయ్య, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.