calender_icon.png 13 January, 2026 | 3:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేరు కుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ

12-01-2026 10:08:42 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మేరు కుల సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై సోమవారం భూమి పూజ నిర్వహించారు. మంథని పురపాలక సంఘం ఏర్పాటు చేసిన శిలాఫలకం వద్ద మంత్రి శ్రీధర్ బాబు కొబ్బరికాయలు కొట్టి భూమి పూజ నిర్వహించగా మేరు కుల సంఘ నాయకులు సైతం కొబ్బరికాయలు కొట్టి భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేరు కులస్తులు మంత్రి శ్రీధర్ బాబును శాలువాలతో ఘనంగా సన్మానించారు. మంథని పట్టణ మేరు కులస్తుల అభ్యర్థన మేరకు మూడు గుంటల భూమిని ప్రభుత్వ పరంగా కేటాయించి, రూ.20 లక్షలను మంజూరు చేయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంత్రి శ్రీధర్ బాబు భూమి పూజ నిర్వహించడం పట్ల మేరు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. మంథని పట్టణం శివారులోని మాత శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ముందు మదన పోచమ్మ దేవాలయం ప్రక్కన మేరు సంఘంతో పాటు పూసల సంఘం రూ. (20 లక్షలు), నాయి బ్రాహ్మణ సంఘం రూ. (20 లక్షలు), కుమ్మరి సంఘం రూ. (20 లక్షలు) స్వర్ణకారుల సంఘం రూ. (20 లక్షల) తో నిర్మించబోతున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు కూడా  ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం నాయకులు పెండ్యాల రామ్ కుమార్, రాపర్తి సంతోష్, పెండ్యాల తిరుమలయ్య, మాడిశెట్టి రాజేశ్వర్, గూడూరి ధనుంజయ, గట్ల శ్రీకాంత్, మంథని రాజు, పెండ్యాల శ్రీధర్, పెండ్యాల చంద్రశేఖర్, మాడిశెట్టి నరేష్, పెండ్యాల అనిత, పెండ్యాల శ్రీనిధి లతో మేరు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.