calender_icon.png 13 January, 2026 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి సహకరించాలి

12-01-2026 10:06:14 PM

నూతన పాలకవర్గం మొదటి  గ్రామసభ

బెజ్జంకి: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రం గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం  మొదటి గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్ పెద్దన్న సభ అధ్యక్షత వహించారు. ఈ సభ సమావేశంలో గ్రామ అభివృద్ధి పై నూతన పాలకవర్గం గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని  అభివృద్ధి జరిగేలా చూడాలని  చర్చించడం జరిగింది.

గ్రామాల్లో నీటి సమస్యలు, డ్రైనేజీ, విది దీపాల సమస్యల పైన వార్డు సభ్యులు ప్రజలు అడిగిన ప్రశ్నకు సర్పంచ్ సమాధానం తెలుపడం జరిగింది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ  ప్రజలు,యువకులు వివిధ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు గ్రామా అభివృద్ధికి సహకరించే విధంగా కృషి  చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ ప్రవీణ్,ఆశ వర్కర్స్,అంగన్వాడి టీచర్ స్ , బండి రమేష్, బి.రూపేష్, శ్రావణ్,మహేష్, బాబు. గుండయ్య,చంద్రం,పొట్లపెల్లి లక్ష్మణ్,భీమయ్య, సంపత్, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.