calender_icon.png 13 January, 2026 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తకే ప్రాధాన్యత

12-01-2026 09:55:05 PM

* ప్రభుత్వం, పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతంతో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి 

* నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి 

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం, పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమం కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తూ పనిచేస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ డిసిసి భవన్ లో నిర్వహించిన నియోజకవర్గస్థాయి పార్టీ సమీక్ష సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్యతో ఎమ్మెల్యే నాయిని పాల్గొని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు కీలక దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండేళ్లుగా నియోజవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరంగా అమలు చేస్తూ ప్రజల మధ్య ఉంటున్నామని తెలిపారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీ బూతుస్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలోని 26 డివిజన్లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్లో జెండా ఎగరవేయాలని తెలిపారు. నాయకులు డివిజన్ పరిధిలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, సంఘాలు, కాలనీ కమిటీలతో మంచి సంబంధాలు కలిగి ఉండాలని తెలిపారు.

ఈనెల ప్రతి డివిజన్లో ఒకరోజు చొప్పున పర్యటన చేపడతానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే కష్టపడి పని చేస్తారో, ప్రజల్లో ఉంటారో వారికే పార్టీ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఏడు ఎకరాల భూమిని గుర్తించామని దానిపై సుమారు 3500 ఇండ్ల నిర్మాణానికి అవకాశం ఉందని తెలిపారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ, ఇంటర్నల్ రోడ్లు ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక పనులు చేశామని, ఈ అభివృద్ధి పనులను ప్రజల్లో ధైర్యంగా చెప్పాలని కార్యకర్తలకు సూచించారు.

సోషల్ మీడియాలో ప్రభుత్వం, ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి పనులే ప్రచారం చేయాలని, అంతేకాకుండా ఎవరో చెప్పారని కార్పొరేట్ టికెట్ అడగకూడదని, ముందు చూపుతో డివిజన్ అధ్యక్షులను బలోపేతం చేయాలని తెలిపారు.అందుకు ప్రతి ఒక్కరు పూర్తిస్థాయిలో డివిజన్లో పనిచేయాలని పిలిపించారు. అంతకుముందు హనుమకొండ 61 వ డివిజన్ పరిధి చైతన్యపురి కాలనీలో 62 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సైడ్ డ్రైనేజీ నిర్మాణ, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇ.వి శ్రీనివాసరావు, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాసరావు, జిల్లా గ్రంధాల సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, ఆర్టిఏ సభ్యులు పల్లంకొండ సతీష్, నాయిని లక్ష్మారెడ్డి, జిల్లా అనుబంధ సంఘాల చైర్మన్లు బంక సరళ సంపత్ యాదవ్, విక్రమ్, రాజ్ కుమార్, శ్రావణ్, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు ఎను కొంటి పున్నం చందర్, తడుక సుమన్ గౌడ్, తాళ్లపల్లి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మండల సమ్మయ్య, మెరుగు శివ, తాళ్లపల్లి రవీందర్ (జెకె), బుస్సా నవీన్ కుమార్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.