12-01-2026 10:12:58 PM
మున్సిపల్ కమిషనర్ ఏ.మహేష్ కుమార్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): ఎల్లారెడ్డి పురపాలక సంఘ కార్యాలయంలో సోమవారం మున్సిపాలిటీకి సంబంధించిన ఎన్నికల ఓటర్ లిస్టును వార్డుల వారీగా మున్సిపల్ కార్యాలయంలో నోటీస్ బోర్డ్ పై అతికించామని మున్సిపల్ కమిషనర్ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మహేష్ మాట్లాడుతూ ఇది ఫైనల్ ఓటర్ లిస్ట్ గా ఉంటుందని ఈ ఓటర్ లిస్టును మున్సిపల్ కార్యాలయంతో పాటు తాసిల్దార్ కార్యాలయం, ఆర్డిఓ కార్యాలయం, దగ్గర ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రజలందరూ ఈ లిస్టును చూసుకొవాలని సూచించారు. మొత్తం ఓటర్ లిస్టు పరిశీలించి ఫైనల్ గా నిర్ణయించి మున్సిపల్ కార్యాలయంలో అతికించామని తెలిపారు జాబితాను ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వాసంతి, వార్డ్ ఇంచార్జ్ అధికారులు, సూర్య వర్ధన్, అంజన్న, కాశిరాం, గంగాధర్, రాజారెడ్డి, శ్రీకాంత్, సుజాత,, జ్యోతి, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.