calender_icon.png 12 January, 2026 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ టికెట్ల కోసం పైరవీలు

12-01-2026 12:34:23 AM

గజ్వేల్  ప్రజ్ఞాపూర్ మున్సిపల్‌లో ముఖ్య నాయకులను కలుస్తున్న ఆశావహులు

చైర్మన్ పదవితోపాటు కౌన్సిలర్ టికెట్లకు పోటాపోటీ ప్రయత్నాలు

బీఆర్‌ఎస్ లో బారులు 

కాంగ్రెస్‌లో నర్సారెడ్డి పైనే భారం 

బీజేపీలో ఒకే ఒక్కడు

గజ్వేల్, జనవరి 11 : మరో నాలుగైదు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండడంతో ఆశావహులు  ఆయా పార్టీల ప్రధాన నాయకుల వద్దకు పరుగులు పెడుతున్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠంతోపాటు 20వార్డుల కౌన్సిలర్ స్థానాలకు ఆయా పార్టీ టికెట్ల కోసం ఆశావహులు పైరవీలు ప్రారంభించారు. ప్రధానంగా బిఆర్‌ఎస్ పార్టీలోనే ఆశావహులు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ చైర్మన్ రేసులో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి ఆయన తనయుడు ఎన్సీ సంతోష్ తో పాటు మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి కూడా చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు.

అలాగే బీసీల్లో గుంటుకు రాజు, గంగిశెట్టి రవి, ఎస్సీల్లో పొన్నాల కుమార్, చందు, పంబాల శివ, నర్సింలు చైర్మన్ పదవికి పోటీలో ఉన్నట్లు సమాచారం. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నుండి దామరంచ ప్రతాపరెడ్డి, కొలి చెలిమి స్వామి చైర్మన్ పదవికి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మీరంతా మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, బిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాపరెడ్డి ఆదేశిస్తేనే పోటీలో ఉంటామని వెల్లడించడం గమనార్హం.

కాంగ్రెస్‌లో నర్సారెడ్డిదే తుది నిర్ణయం 

 కాంగ్రెస్ పార్టీలోనూ చైర్మన్ కౌన్సిలర్ స్థానాలకు ఆశావహులు అధిక సంఖ్యలోనే ఉన్నా బయటపడడం లేదు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి నిర్ణయమే అధిష్టాన నిర్ణయంగా భావించి  ముందుకు వెళ్లేందుకు ఆ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు.  అయితే టిఆర్‌ఎస్ పార్టీ నుండి గెలిచే అవకాశం ఉన్న కొందరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, దాంతో మున్సిపల్ చైర్మన్ పదవిని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు అంతర్గతంగా ప్రణాళికలు కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

బిజెపిలో ఒకే ఒక్కడు 

 బిజెపి పార్టీలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ పదవికి పార్టీ ఏకగ్రీవంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ నే తమ అభ్యర్థిగా చర్చించుకుంటున్నట్లు ప్రచారం కొనసాగుతుంది. ఈ మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ తో పాటు, మల్లల సాగర్ ముంపు గ్రామాలలో గెలుపుకురాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఆయా వార్డులవారీగా తనను బలపరిచేందుకు కౌన్సిలర్ అభ్యర్థులను ఎంపిక చేసుకొని ముందుకు సాగుతున్నారు. పార్టీ నాయకులతో పాటు అధిష్టానం కూడా భాస్కర్ కు అండగా ఉండడంతో తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. 

ఛాలెంజ్ గా మారిన వార్డుల విభజన

 గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వార్డుల విభజన జరగడంతో వార్డుల విస్తీర్ణం పెరిగి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. దీంతో ఆయా అవార్డులలో కాంగ్రెస్ బిఆర్‌ఎస్, బిజెపి పార్టీల నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న పలువురికి గెలుపు చాలెంజిగా మారింది. ఒక్కో వార్డులో 2వేల ఓట్లకు పైగా పెరగడంతో అది కొద్ది సమయంలో ప్రచారం చేయడం కష్టంగానే మారనుంది. దీనికి తోడు తమను బలపరిచే ఓటర్లు వివిధ వార్డుల్లోకి మారడంతో కొత్త ఓటర్లను మచిగా చేసుకో వాల్సిన అవసరం ఏర్పడింది. ఈసారి మున్సిపల్ ఎన్నికలు గతం కన్నా మరింత ఉత్కంఠతను పట్టణ ప్రజల్లో రేకెత్తిస్తుంది.