02-07-2025 10:02:11 PM
మంథని (విజయక్రాంతి): మంథని పట్టణంలోని గ్రంథాలయాన్ని స్థానిక గ్రంథాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ బుధవారం పరిశీలించారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ఆధ్వర్యంలో వాటర్ బోర్వెల్, మోటార్నీ, రేకుల షెడ్, సుమారు పది లక్షల నిధులతో మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించబోతున్నారని, త్వరలోనే మంథని గ్రంథాలయ భవనాన్ని జిల్లాలోని అతి సున్నితమైన భవనాన్ని నిర్మాణం చేస్తానని అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు. మంత్రి ఆధ్వర్యంలో గ్రంథాలయాన్ని నిరుద్యోగుల ఉద్యోగ నిలయాలుగా మారుస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ నియంత్రణ మండలి మెంబర్ శశిభూషణ్ కాచే, సహకార చైర్మన్ కొత్త శ్రీనివాస్, జిల్లా ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఆయిల్ ప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, సీనియర్ నాయకుడు అజీమ్ ఖాన్, కుడుదుల వెంకన్న, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, సోషల్ మీడియా జిల్లా ఇంచార్జ్ ఆరేల్లి కిరణ్ గౌడ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, ఆరెల్లి వరుణ్ గౌడ్, బెజ్జంకి డిగంబర్, గడ్డం సత్యనారాయణ, బూడిద రమేష్, చంద్రు విజయ్, ఎరుకల సురేష్, శ్రీనివాసు ఫహీం. శంకర్ లింగం, తదితరులు పాల్గొన్నారు.