calender_icon.png 11 October, 2025 | 9:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ అక్కగా బాధ్యతల నిర్వహణ

11-10-2025 04:56:05 PM

కేజీబీవీ పాఠశాలలో జిల్లా పోలీస్ వినూత్న కార్యక్రమం

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో జిల్లా ఎస్పీ జానకి షర్మిల వినూత్న కార్యక్రమాలతో జిల్లా ప్రజలకు మరింత చేరువవుతున్నారు. శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా మహిళా పోలీసులు కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులతో మమేకమై వినూత్న కార్యక్రమాలను నిర్వహించి బాలికలకు భరోసా కల్పించారు. జిల్లాలోని అన్ని కేజీబీవీ పాఠశాలలో పోలీసు అక్క పేరుతో ఉదయం నుండి సాయంత్రం వరకు విద్యార్థులతో కలిసి భోజనం చేయడం చదువుకోవడం డ్రాయింగ్ వేయడం సైబర్ నేరాలు బాలికల హక్కులపై అవగాహన విద్య అవకాశాలు 100 డేస్ ఉపయోగం తదితర అంశాలపై అవగాహన కల్పించి ఈ అవసరం వచ్చినా పోలీస్ అక్కను సంప్రదించాలని సూచించారు. మహిళా పోలీసులు విద్యార్థులతో కలిసి ఆటపాట కాలక్షేపరాలతో గడిపి వారితో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంపై జిల్లా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.