calender_icon.png 11 October, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్, బీజేపీ కుట్ర వలనే బీసీలకు అన్యాయం

11-10-2025 04:59:20 PM

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య..

అశ్వాపురం (విజయక్రాంతి): బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కుట్రల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య అన్నారు. మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో  మీడియాతో ఆయన మాట్లాడుతూ, బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయంగా కులగణన సర్వే నిర్వహించిందని తెలిపారు. ఆ సర్వే ఆధారంగా బీసీ బిల్లును అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడం కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన చట్టాలే బీసీ రిజర్వేషన్లకు అడ్డంకిగా మారాయని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి లేదని బిక్షమయ్య ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లుకు అడ్డు చెప్పడంతో రాష్ట్ర గవర్నర్ ఆ బిల్లును ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉంచారని ఆయన విమర్శించారు. బీసీల నోటి కాడి ముద్ద లాక్కున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజా తీర్పులో తగిన శాస్తి తప్పదని  బిక్షమయ్య హెచ్చరించారు.