19-08-2025 11:08:06 PM
వేగంగా పోలీసు సేవలు అందించాలి
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి
సైబర్ మోసాల గురించి ప్రజలకు వివరించాలి
పాత నేరస్తులు, జూలాయి వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలి
వార్షిక తనిఖీలో పెన్ పహాడ్ పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్పీ కె. నరసింహా
పెన్ పహాడ్: ఆవేదన, కష్టాలు, బాధతో పోలీస్ స్టేషన్ కు వచ్చే వారికి రాజకీయాలకు అతీతంగా 'న్యాయం.. నిజాయితీ.. పారదర్శత'తో మేమున్నామంటూ సహాయం అందించినప్పుడే ప్రజాభిమానం స్వంతం చేసుకోవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నర్సింహా సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో భాగంగా స్టేషన్ సందర్శించి మాట్లాడారు. ఈ సందర్బంగా పరేడ్ ఇన్స్పెక్షన్, రైట్ గేర్, సిబ్బంది కిట్ ఇన్స్పెక్షన్, రికార్డ్స్ మెంటనేన్స్, కేసు ఫైల్స్ మూమెంట్, వెపన్ డీటేయిల్స్ పై ఆరా తీశారు.
క్రమశిక్షణతో పని చేయాలి స్నేహపూర్వక పోలింగ్ నిర్వహిస్తూ ప్రజల అభిమానం పొందాలని సూచించారు. అనంతరం స్టేషన్ రికార్డ్స్, పరిసరాలు పరిశీలించారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని విధులు చేపట్టాలన్నారు. రౌడి షిటర్స్, సస్పెక్ట్ పై, సమస్యలు సృష్టించే జులాయి వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు. స్టేషన్ పరిధిలో గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో పెట్రోలింగ్, తనిఖీలు నిరంతరంగా చేయాలని ఆదేశించారు. ప్రజా పిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళా కేసుల్లో నిస్పక్షంగా పని చేస్తూ ప్రతి విషయమును రికార్డ్ లో నమోదు పరచాలని, పోలీస్ స్టేషన్ కు వచ్చే వారిని మర్యాద పూర్వకముగా ఆహ్వానించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.
బాలికల వసతి గృహలపై.. ఎల్లప్పుడూ ఆకాతాయిలపై నిఘా ఉంచాలన్నారు. ముందుగా పోలీసు స్టేషన్ నందు సిబ్బంది కవాతు, సిబ్బందిలో సమన్వయం ను పరిశీలించారు. కాగా పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. సామాజిక కార్యక్రమాలు, అక్రమరవాణా, దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల నివారణ, బాలకార్మిక వ్యవస్థ, CC కెమెరాల ఏర్పాటు మొదలగు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సమాజానికి ఉత్తమ సేవలు అందించాలన్నారు.