calender_icon.png 8 October, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాహనాలను తనిఖీ చేసిన జిల్లా రవాణా శాఖ సహాయక అధికారి

08-10-2025 12:53:43 AM

బోయినపల్లి, అక్టోబర్ 7 ( విజయ క్రాంతి): వాహన ప్రత్యేక తనిఖీలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శా ఖ అధికారి ఆదేశాల మేరకు బో యినపల్లి మండలం కొదురుపాక నుండి మండలంలోని చుట్టూ గ్రా మాలలో మోటారు వాహనాల స హాయక తనిఖీ అధికారి రజనీ దేవి విస్తృత తనిఖీలు చేపట్టి వాహనములకు సంబంధించిన సరియగు పత్రాలు లేని నాలుగు వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు.

ఇట్టి తనిఖీల్లో భాగంగా వాహనదారులు తప్పనిసరిగా వాహనంలకు చెల్లించాల్సిన పన్ను,బీమా, ఫిట్నెస్ కండిషన్, పర్మిషన్,పొల్యూషన్, లైసెన్సులు తమ వెంట ఉండేటట్టు చూసుకోవాలని ఆమె తెలిపారు. టాక్స్ కట్టని వాహనంలకు తనిఖీలో భాగంగా రవాణా శాఖ అధికారులు పట్టుకొని సీజ్ చేస్తే 200 పర్సెంట్ అదనపు రూపాయలు చెల్లించవలసి వస్తుందని చెప్పారు.

అదేవిధంగా ప్రయాణికులను సీట్లకు మించి అధికంగా తీసుకెళ్లొద్దని, సరుకు రవాణాకు సంబంధించిన వాహనాలు అధికలోడు తీసుకువెళ్లద్దని,వాహనయజుమానులకు సూచించారు.ద్విచక్ర వాహనం లకు సంబంధించి 15 సంవత్సరములు కాలపరిమితి దాటిన సొంతానికి వాడుకునే అన్ని వాహనములు తప్పనిసరిగా గ్రీన్ టాక్స్ చెల్లించి మీ వాహనములను పునరుద్దించుకోవాలని