23-01-2026 12:40:20 AM
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
సికింద్రాబాద్ జనవరి 22 (విజయక్రాంతి) : కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం ఫతేనగర్ డివిజన్లోని పర్యటించారు. ఇందులో భాగంగా ఫతేనగర్ డివిజన్లోని భరత్ నగర్ కాలనీలో ప్రధాని రహదారిలో వాటర్ వర్క్స్ అధికారులు రోడ్డు తవ్వి రోడ్డు వేయకపోవడంతో రోడ్డు ఎగుడు దిగుడుగా ఉండడంతో స్కూ లు పిల్లలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యను కాలనీవాసులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, అధికారులతో కలిసి ఆ ప్రాం తాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా జల మండలి అధికారులుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్యం, దోమల సమస్యలకు సంబంధించి స్థానికులు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలన్నీ పరిష్కరించి పది రోజుల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్, మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ కుమార్, ఈఈ గోవర్ధన్, ఏఈ రంజిత్, డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీను, బిక్షపతి, విజయ్ కుమా ర్, ఉమావతి గౌడ్, జ్యోతి గౌడ్, కుమారి, జనరల్ సెక్రెటరీ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.