19-02-2026 01:47:14 AM
ఎల్బీనగర్, ఫిబ్రవరి 18 : విడాకులు ఇచ్చి రెండో పెళ్లి చేసుకుందన్న కక్షతో ఇంట్లో చొరబడి మాజీ భార్యను మాజీ భర్త వేట కొడవలితో దాడి చేసి, హత్య చేశాడు. ఈ ఘటన బీఎన్ రెడ్డి డివిజన్ కొప్పుల చెరువు సమీపంలోని గ్రీన్ సిటీ కాలనీలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న వనస్థలిపు రం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే... పెద్దపల్లి జిల్లా మంథని మండల కేంద్రానికి చెందిన దేవరకొండ మహేశ్ (31), మహారాష్ట్రకు చెందిన సునీత (29)ను 2022లో ప్రేమ వివాహం చేసుకు న్నాడు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. వివా హం జరిగిన వెంటనే మహేశ్ ఉద్యోగ రీత్యా కెనడా దేశానికి వెళ్లాడు. ఏడాది తర్వాత సునీతను కెనడాకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య కలహాలు చోటు చేసుకోవడంతో ఐదు రోజుల తర్వాత వెంటనే ఇండియాకు వచ్చింది.
భర్త మహేష్‌పై మహారాష్ట్రలో గృహహింస కేసు పెట్టిం ది. అప్పటి నుం చి భార్యాభర్తల మధ్య దూ రం పెరిగింది. ఈ క్రమం లో 2024 ఇద్దరు విడాకులు తీసుకున్నారు. కాగా, పది నెలల క్రితం సునీత రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండ లం రావిరాల గ్రామానికి చెందిన సాప్ట్ వేర్ ఉద్యోగి శ్రీనాథ్(30)ను ప్రేమ వివాహం చేసుకున్నది.
ఇద్దరు కలిసి బీఎన్ రెడ్డి డివిజన్ కప్పల చెరువు సమీపంలోని గ్రీన్ సిటీ కాలనీలోని ఒక అపార్ట్మెంట్ లో ప్లాట్ లో నివాసం ఉంటున్నారు. ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. సునీత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండగా, శ్రీనాథ్ హైదరాబాద్ లోని ఆఫీసుకు వెళ్తున్నాడు. సునీత మూడు నెలలు గర్భిణి కావడంతో భార్యకు తోడుగా శ్రీనాథ్ తన తల్లిని ఇం టికి తెచ్చుకున్నాడు.
అపార్ట్‌మెంట్‌లో చొరబడి హత్య
గ్రీన్ సిటీ కాలనీలో సునీత ఉం టున్న అపార్ట్మెంట్ కు అద్దెకు తీసుకున్న కారు లో మహేష్ వచ్చాడు. 5 లీటర్ల పెట్రోల్, కత్తి, ఇతర మారణాయుధాలను బ్యాగులో అప్పటికే సిద్ధం వేసుకుని వచ్చాడు. అప్పటి వరకు ఇంటిలో ఉన్న శ్రీనాథ్ తల్లి బయటకు వెళ్లిం ది. మహేశ్ వెంటనే ఐదో అంతస్తులో ఉంటున్న సునీత ప్లాట్ లోకి చొరబడి, వేట కొడవలితో పలుమార్లు సునీతపై దాడి చేసి, చంపాడు.
ముందస్తుగా వెంట తెచ్చుకున్న పెట్రోల్ ప్లాట్ మొత్తం చల్లాడు. సునీతను చంపిన మహేశ్ బాత్రూమ్ లో దాక్కున్నాడు. అలజడి గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహేశ్ తో మాట్లాడి, బయటకు రప్పించి, అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మృతురాలి భర్త శ్రీనాథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు.
పగతో రగిలిపోయిన మొదటి భర్త మహేశ్
సునీత రెండో వివాహం చేసుకుని సంతోషంగా ఉందని, కేసులు పెట్టి, తనను ఇబ్బందు లు పెట్టిందని మొదటి భర్త మహేశ్ పగతో రగిలిపోయాడు. సునీత విషయం తెలుసుకున్న మహేశ్ బీఎన్ రెడ్డి డివిజన్ కు వచ్చి సునీత ఉంటున్న అపార్ట్మెంట్ ప్రాంతంలో నెల రోజులుగా రెక్కీ నిర్వహించాడు. ముందస్తు పథకం ప్రకారం సునీతను హత్య చేయడానికి మారణాయుధాలను ఆన్ లైన్ లో కొనుగోలు చేశాడు.