15 April, 2026 | 6:44 AM

కాలేజీ ఫీజులు చెల్లించలేక బోయినపల్లిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

19-02-2026 12:00 AM

బోయినపల్లి: ఫిబ్రవరి 18(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామం హామ్లెట్ దుబ ్బపల్లిలో రామంచ సంజయ్ (18)అనే యువకుడు హైదరాబాద్ అవంతి కళాశాలలో బి.టెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు.

అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక కాలేజీ ఫీజులు చెల్లించలేకపోవడంతో గత మూడు నెలలుగా ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబ ఆర్థిక సమస్యలు మరియు తన అక్క వివాహం విషయమై మనస్తాపానికి లోనవుతూ ఉండేవాడని తండ్రి తెలిపాడు. బుధవారం ఉదయం 07:30 గంటల సమయంలో చిన్న విషయంపై తండ్రి మందలించగా, సంజయ్ ఇంట్లో ఫ్యాన్కు టవల్తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి రామంచ అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోయినపల్లి ఎస్‌ఐ రమాకాంత్ తెలిపారు.