calender_icon.png 17 July, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనస్తాపంతో దివ్యాంగుడి ఆత్మహత్య

12-07-2025 08:01:30 PM

కుటుంబాన్ని పరామర్శించిన విహెచ్పిఎస్ నాయకులు

కొత్తకోట:  వనపర్తి జిల్లా కొత్తకోట మండలం విలియంకొండ గ్రామం మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న బొల్లి ఆంజనేయులు కుటుంబాన్ని శనివారం  విహెచ్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమ ప్రభాకర్ శెట్టి, వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి బాజ శేఖర్ లు ఆంజనేయులు స్వగృహానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆంజనేయులు ఆత్మకు శాంతి కలగాలని చిత్రపటానికి నివాళులు అర్పించారు.

దివ్యాంగుడు ఆంజనేయులుకు తల్లి భాగ్యమ్మ భార్య సరోజ కుమారులు ప్రవీణ్(14) ప్రణీత్(10) మనోజ్(08) లు కలరు అని వారు తెలిపారు. కుటుంబానికి పెద్దదిక్కు ఆయన ఆంజనేయులు మృతిని జీర్ణించుకోలేక శోక సంద్రంలో మునిగిన కుటుంబికులు. కుటుంబానికి పద్మశ్రీ గ్రహీత మందకృష్ణ మాదిగ కమిటీ, విహెచ్పిఎస్ కమిటీ ఎల్లవేళలా అండగా ఉంటాయని మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... బొల్లి ఆంజనేయులు మరణం కుటుంబానికి, వీహెచ్పీఎస్ కమిటీకి తీరని లోటుని వారన్నారు.

బొల్లి ఆంజనేయులు అంగవైకల్యంపై దూషిస్తూ డబ్బులు ఇవ్వాలని తన చిరు వ్యాపారమైన కిరాణం షాపులో సరుకులు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేస్తూ పలుమార్లు ఇబ్బందులు పెడుతూ నేడు హత్యకు కారకుడు అయినా బెల్లి వంశీని దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠిన కారాగార శిక్షలు విధించవలసిందిగా వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం గుర్తించి దివ్యాంగుడైన బొల్లి ఆంజనేయులు కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.