calender_icon.png 13 July, 2025 | 12:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సకాలంలో విత్తనాలు ఎరువులు పంపిణీ చేయాలి

12-07-2025 07:58:27 PM

సీపీఏం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు..

మణుగూరు (విజయక్రాంతి): ఖరీఫ్ సీజన్ లో మండల రైతాంగం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ అధికారులు అవసరమైన ఎరువులు, విత్తనాలను సరఫరా చేయాలని, సీపీఏం మండల కార్యదర్శి సత్రపల్లి సాంబశివరావు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. మండలంలో సన్నా చిన్నకారు రైతులు సుమారుగా 8 వేలమంది ఉన్నారని, వరి, పత్తి మొక్కజొన్న సాగుకు రైతులు యూరియా లేక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. వ్యవసాయ సాగు ప్రారంభ దశలో ఎరువుల కొరతతో రైతుల ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు కొందరు నకిలీ విత్తనాలను ఎరువులతో రైతులను మోసం చేస్తున్నారని, ఆరోపించారు. ఫెర్టిలైజర్ షాపులపై వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకో వాలన్నారు.