calender_icon.png 13 July, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాగారం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు మాయం

12-07-2025 08:02:14 PM

పైసలు ఇస్తే పదిలం లేకుంటే మాయం..

నాగారం: నాగారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు ఫామ్స్ మాయమవుతున్నాయని మండల ప్రజలు దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. కుటుంబ సభ్యులు నిర్ధారణ జనన ధ్రువీకరణ దరఖాస్తులు విద్యార్థుల చదువుల నిమిత్తం ఆదయ ధృవీకరణ కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ల కొరకు అప్లై చేసుకోనీ మీ సేవలో ఆన్లైన్ చేయించుకొని తహసీల్దార్ కార్యాలయంలో వచ్చి చూడగా దరఖాస్తులు మయమవుతున్నాయి. దీంతో ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో మళ్ళీ మీ సేవకు వెళ్లి మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైసలు ఇస్తే మాత్రం దరఖాస్తు జాగ్రత్తగా ఉంచుతున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు.

పైసలు ఇవ్వని వారి దరఖాస్తులు మాత్రం గాలికి వదిలి వేస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు. గతంలో పని చేసిన ఆర్ఐ, ఎంపిఎస్వోలు ఇష్టరాజ్యాంగ వ్యవహరించి వందల సంఖ్యలో దరఖాస్తులను తమ వద్ద ఉంచుకొని ఇబ్బందులకు గురిచేసినారని తహసీల్దార్ కార్యాలయంలో అసలు ఏమి జరుగుతుందని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు స్పందించి తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు.