18-10-2025 03:27:57 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో శనివారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు.పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు నూతన వస్త్ర వేషధారణలో రంగవల్లులతో అందంగా అలంకరించి దీపాలు వెలిగించారు. వేడుకలలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపల్ కృష్ణప్రియ పాల్గొని విద్యార్థులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దీపావళి చెడుపై మంచి గెలిచిన సంకేతమని, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, పటాకులు కాల్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.