18-10-2025 03:26:00 PM
దళారుల మాటలు నమ్మి మోస పోవద్దు
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
బిచ్కుంద,(విజయక్రాంతి): సోయా రైతులు ఎవరు తొందరపడవద్దని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ దళారుల మాటలు నమ్మి అమ్ముకోవద్దని సూచించారు. జుక్కల్ నియోజకవర్గ సోయా రైతులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భరోసా కల్పించారు..సోయా ధాన్యం కొనుగోలు విషయం, రైతుల సమస్యల గురించి శనివారం రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగా రెడ్డితో ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఫోన్ లో మాట్లాడారు.
వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ చేపడుతామని ఈ సందర్భంగా మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగా రెడ్డి ఎమ్మెల్యేకు తెలిపారు. రైతులు ఎవరూ ఇబ్బందులు పడకూడదని అన్నారు. ఢిల్లీలోని నాఫెడ్ అధికారులతో కూడా మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. వారం రోజుల్లో కొనుగోలు ప్రక్రియ చేపట్టకపోతే, అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సోయా రైతులకు భరోసా కల్పించారు.కాబట్టి రైతులు ఎవ్వరూ తొందరప డొద్దని,దళారుల మాటలు నమ్మి మోస పోవద్దని ఎమ్మెల్యే రైతులకు విజ్ఞప్తి చేశారు.