calender_icon.png 19 October, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

29న హైదరాబాద్ టెక్ సమ్మిట్

18-10-2025 11:32:45 PM

ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యతలో సాధికారత సాధనకు అక్టోబర్ 29న హైదరాబాద్, రెడ్ హిల్స్ ఎఫ్ సీసీఐలో ‘హైదరాబాద్ టెక్ సమ్మిట్-2025‘ నిర్వహిస్తున్నామని కీబోటెక్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ రషీద్ శుట్టారి వెల్లడించారు. ఈ మేరకు శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సబ్మిట్ కు సంబంధించిన బ్రోచర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సమ్మిట్ కు శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ స్కిల్స్ నిపుణుడు డాక్టర్ ఆశిష్ మిత్తల్, కేయూ డీన్ ఆనంద్ బేతపూడి, రెడ్డి కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ రేణుక సాగర్, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఆలియా, సైబర్ సెక్యూరిటీ కృష్ణ శాస్త్రి లు హాజరై విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొని విద్యార్థులకు సాంకేతిక అంశాలపై పలు సూచనలు, అవగాహన కల్పిస్తారని వివరించారు.

ఇప్పటికే కీబోటెక్ సంస్థలో పనిచేస్తున్న ఇంటెన్షిప్ టీం తమ ‘జెన్ జెడ్‘ ఆలోచనలతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ సమ్మిట్ లో పారిశ్రామిక నిపుణులు, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, స్టార్టప్ లు కలిసి తమ ఆలోచనలు ఆవిష్కరణలు అనుభవాలను పంచుకుంటారని తెలిపారు. ఈ సమ్మిట్ లో ఆసక్తి ఉన్న డిగ్రీ పీజీ, ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనవచ్చు అని తెలిపారు. ఈ సందర్భంగా ముజపిన్ అనే విద్యార్థి తాను తయారు చేసిన మెడిజో యాప్ గురించి వివరించారు. పూర్తి వివరాలకు 8074638408, www.kibotechsummit.in సంప్రదించగలరని తెలిపారు.