18-10-2025 11:29:24 PM
బందులో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్..
ముషీరాబాద్ (విజయక్రాంతి): బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ జేఏసీ శనివారం తలపెట్టిన బీసీ బంద్ కార్యక్రమం ముషీరాబాద్ లో సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్ పూర్, గాంధీనగర్, కవాడిగూడ, ముషీరాబాద్, అడిక్ మెట్, రాంనగర్ డివిజన్లో అఖిలపక్ష నేతలు బంద్ లో పాల్గొని వాణిజ్య వ్యాపార సంస్థలను బంద్ చేశారు. ఈ బంద్ కార్యక్రమంలో రాష్ట్రమంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ ఎం. అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి, తెలంగాణ బీసీ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు సిహెచ్ ఉపేంద్ర, అంబాల నారాయణ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు ముఠా జయసింహ నాతో పాటు అఖిలపక్ష నేతలు బందులో పాల్గొన్నారు.