22-10-2025 12:32:59 AM
భీమదేవరపల్లి ,అక్టోబర్ 21 (విజయక్రాంతి): ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంకులో దీపావళి పండుగను పురస్కరించుకొని ములుకనూరు సహకార గ్రామీణ పరపతి మార్కెటింగ్ సొసైటి లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో, కొత్తకొండ బ్రాంచ్ ఆఫీసులో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, జనరల్ మేనేజర్ యం. రాం రెడ్డి లక్ష్మీ పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో సంఘ ఉపాద్యక్షులు గజ్జి వీరయ్య, కార్యవర్గ సభ్యులు గనబోయిన శ్రీనివాస్, కాసిరెడ్డి వసంత, బొల్లంపెల్లి కుమారస్వామి, అంబాల రాములు, బేల కనుకమ్మ, కర్రె మహేందర్, కంది రవిందర్ రెడ్డి, మండ శ్రీనివాస్, చెవ్వల్ల బుచ్చయ్య, ఈర్ల మూగయ్య, గుగ్లోతు బాషు, గుర్రాల భాస్కర్ రెడ్డి, బొల్లపెల్లి వీరా రెడ్డి , గ్రామ అభివృద్ధి కమిటి సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు .