01-09-2025 02:37:22 PM
కన్నాయిగూడెం ఎస్సై ఈనిగాల వెంకటేష్..
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో గణేష్ ఉత్సవాల్లో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని డీజేలను పూర్తిగా నిషేధం విధించినట్లు కన్నాయిగూడెం ఎస్ఐ ఇనిగాల వెంకటేష్(SI Inigala Venkatesh) స్పష్టం చేసారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కన్నాయిగూడెం మండలంలో గణేష్ మండప నిర్వహకులు ఎట్టి పరిస్థితుల్లో డీజేలను ఏర్పాటు చేయరాదని, డీజేలు పెట్టుకుంటే ఓనర్స్ పై, ఆపరేటర్స్ పై కేసులు నమోదు చేస్తామన్నారు. మండపాల వద్ద సీసీ టీవీలను ఎర్పాటు చేసుకుంటే మంచిదని, మండపాల వద్ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లు, ఫైర్ సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని, ఎమర్జెన్సీ పరిస్థితుల కోసం హెల్ప్ లైన్ నెంబర్లు కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా, గణేష్ మండపాల వద్ద సందర్శించే మహిళలపై, యువతులపై ఈవ్ టీజింగ్ జరగకుండా చూడాలని అనుమతి లేకుండా డీజేలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.