calender_icon.png 30 August, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయొద్దు

03-07-2024 03:25:32 AM

  • ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

ఆదిలాబాద్, జూలై 2(విజయక్రాంతి): తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ విద్యార్థులకు సూచించారు. ఆదిలాబాద్‌లోని బీసీ హాస్టల్‌ను ఎమ్మెల్యే మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్ గదులు, వంటగదిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే అల్పాహారం ఆరగించారు.