11-10-2025 06:28:15 PM
కంచర్ల మహిళా సంఘం అధ్యక్షురాలు బోదాసు విజయ..
వీర్నపల్లి (విజయక్రాంతి): వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో మహిళ సంఘాల అధ్యక్షురాలు విజయ ధాన్యం కొనుగోలు కేంద్రంను ప్యాక్స్ అప్పగించొద్దని ప్యాక్స్ ద్వారా కొనుగోలు కేంద్రానికి గన్ని సంచులు పంపించడం సరికాదని నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గతంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యంను ప్యాక్స్ వారే కొనుగోలు చేశారు. గత పంట నుండి మహిళ సంఘాల సభ్యులు ఆర్థికంగా అభివృద్ధికి చెందాలని ఉద్దేశ్యంతో ప్యాక్స్ నుండి మహిళ సంఘాల ఐకేపీ అప్పగించారు.
దీంతో కొనుగోలు సంబంధించిన ట్యాబ్, వస్తువులు వేలు ఖర్చు పెట్టి తెచ్చి ధాన్యం కొనుగోలు చేశాం. ఒక్క పంట మాత్రమే కొనుగోలు చేయడంతో మళ్ళీ ప్యాక్స్ కు జిల్లా అధికారులు అప్పగించడంతో వేలు పెట్టి ఖర్చు చేసిన ఖర్చు భారం పడటమే కాకుండా ఆర్థికంగా నష్టం పోతున్నామని సంబంధించిన అధికారులు స్పందించి మహిళ సంఘాలకే ధాన్యం కొనుగోలు కేంద్రంను అప్పగించాలని మహిళ సంఘాల సభ్యులు, రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘాల సభ్యులు దండుగుల నర్సవ్వ, పద్మ, సామల్ల నిర్మల, పులి వర లక్ష్మీ, కడరీ మణెమ్మ, కొమ్ము కవిత, రజిత, నాగరాణి, రైతులు బోదాసు ఎల్లయ్య ఉన్నారు.